Saturday, June 11, 2016

ముఖం కాంతివంతం కావాలంటే

 ముఖం కాంతివంతం కావాలంటే
ముఖం కాంతివంతం కావాలంటే... రెండు టీ స్పూన్ల ఆలివ్ ఆయిల్ను పట్టించి 20 నిమిషాల పాటు మసాజ్ చేసి గోరువెచ్చని నీటితో కడగాలి

కాళ్ళ పగుళ్లు తగ్గాలంటే

  కాళ్ళ  పగుళ్లు తగ్గాలంటే



చలికాలంలో పాదాలు పగులుతుంటాయి. ఈ పగుళ్లు తగ్గాలంటే... అర కప్పు కొబ్బరి నూనెలో 10 వేపాకులు, చిటికెడు పసుపు, చిటికెడు కర్పూరం వేసి మరిగించి, చల్లారిన తర్వాత వడకట్టి నిల్వ చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ఉదయం, సాయంత్రం క్రమం తప్పకుండా రెండు వారాల పాటు పాదాలకు రాసుకుంటే పగుళ్ళు తగ్గి మృదువుగా తయారవుతాయి.

గాజు వస్తువులను వాడేసిన టీ పొడితో రుద్ది కడిగితే


గాజు వస్తువులను వాడేసిన టీ పొడితో రుద్ది కడిగితే

గాజు వస్తువులను వాడేసిన టీ పొడితో రుద్ది కడిగితే వాటిమీద పడిన మరకలు త్వరగా వదిలి శుభ్రపడతాయి

ముఖం ఫై ముడతలు తగ్గాలంటే

 ముఖం ఫై ముడతలు తగ్గాలంటే


కోడిగుడ్డు తెల్ల సొనలో నిమ్మరసం కలిపిన మిశ్రమాన్ని ముఖం, మెడ భాగంలో పట్టించి పది నిమిషాల తర్వాత చల్లని నీటితో కడిగేస్తే ముడతలు తగ్గుతాయి

గిన్నె అడుగు మాడినప్పుడు...

 గిన్నె అడుగు మాడినప్పుడు...
గిన్నె అడుగు మాడినప్పుడు దానిని ఎక్కువసేపు కష్టపడి తోమకుండా ఆ గిన్నెలో కొద్దిగా డిష్ సోప్ వేసి నీళ్లు పోసి కొంచెంసేపు చిన్న మంట మీద ఉంచాలి. ఆ తరువాత కడిగితే బాగా శుభ్రపడుతుంది.

ఎండకు ముఖం కమిలితే

 ఎండకు ముఖం కమిలితే
ఎండకు ముఖం కమిలితే రెండు టీ స్పూన్ల పుల్లటి పెరుగులో చిటికెడు చందనం పొడి కలిపి ముఖానికి పట్టించి 20 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో కడగాలి. ఇలా క్రమం తప్పకుండా రెండు వారాలు చేస్తే చర్మం తిరిగి కాంతివంతగా ఉంటుంది.

పేస్ ప్యాక్

 పేస్ ప్యాక్
రెండు స్పూన్ల తొక్కతీసిన టొమాటో గుజ్జులో నాలుగు టీ స్పూన్ల అరటిపండు గుజ్జు కలిపి ఆ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి 20 నిమిషాల తర్వాత చల్లని నీటితో కడగాలి. ఇలా వారానికి రెండు సార్లు చేస్తే ముఖం కాంతివంతంగా ఉంటుంది.

సబ్బు ముక్కలు మిగిలిపోతే

సబ్బు ముక్కలు మిగిలిపోతే



సబ్బు ముక్కలు మిగిలిపోతే వాటిని సన్నగా తరిగి సర్ఫ్ లో కలిపి బట్టలు ఉతికితే మంచి వాసన  వస్తాయ్ 

వంటింటి చిట్కా 3

వంటింటి చిట్కా 3 
కట్ లెట్, టిక్కిలు వంటివి చేసేటప్పుడు..బంగాలదుంపను ఉడికించి చల్లార్చి ఉపయోగిస్తే రుచిగా ఉంటాయ్.

టమాటా సూప్‌కి చక్కని రంగు రావాలంటే

 టమాటా సూప్కి చక్కని రంగు రావాలంటే
ఇంట్లో చేసుకొనే టమాటా సూప్కి చక్కని రంగు రావాలంటే అందులో చిన్న బీట్రూట్ ముక్క వేస్తే రంగూ, పోషకాలు రెండూ ఉంటాయి

చలికాలంలో చర్మం పొడిబారకుండా ఉండాలంటే

 చలికాలంలో చర్మం పొడిబారకుండా ఉండాలంటే
చలికాలంలో చర్మం పొడిబారకుండా ఉండాలంటే... రాత్రి పడుకోబోయే ముందు టీ స్పూన్ బాదమ్ నూనెలో చిటికెడు చందనం పొడి కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి అయిదారు నిమిషాలు మసాజ్ చేసి ఉదయానే గోరు వెచ్చని నీటితో కడిగి మెత్తని టవల్తో తుడవాలి. ఇలా వారానికి రెండు సార్లు చేయాలి

పట్టుచీరలను ఉతికేటప్పుడు

 పట్టుచీరలను ఉతికేటప్పుడు
పట్టుచీరలను ఉతికేటప్పుడు కొంచెం నిమ్మరసం వేస్తే వాటి రంగు పోకుండా కొత్త వాటిలాగే మెరుస్తాయి.

చలికి చర్మం వడలినట్టుగా ఉండి దురదగా అనిపిస్తే

 చలికి చర్మం వడలినట్టుగా ఉండి దురదగా అనిపిస్తే 
చలికి చర్మం వడలినట్టుగా ఉండి దురదగా అనిపిస్తే ఆలివ్ ఆయిల్ని వంటికి పట్టించి పెసరపిండితో నలుగుపెట్టుకుని స్నానం చెయ్యాలి. ఇలా వారానికి రెండు సార్లు చేస్తే చర్మం పొడిబారడం తగ్గి కాంతివంతంగా ఉంటుంది.

చేప ముక్కలను రోజంతా ఫ్రిజ్‌లో నిల్వ ఉంచినట్లయితే

చేప ముక్కలను రోజంతా ఫ్రిజ్లో నిల్వ ఉంచినట్లయితే




చేప ముక్కలను రోజంతా ఫ్రిజ్లో నిల్వ ఉంచినట్లయితే... వాడుకోవడా నికి గంట ముందు బయటకు తీసి టీ స్పూన్ పసుపు, టీ స్పూన్ ఉప్పు వేసి కడగాలి. ఇలా చేయడం వల్ల ముక్కలు గట్టిబడి వాసన రాకుండా ఉంటాయి.

పగిలిన పాదాలు వేధిస్తుంటే

 పగిలిన పాదాలు వేధిస్తుంటే
పగిలిన పాదాలు వేధిస్తుంటే కొబ్బరి నూనెకి పెట్రోలియం జెల్లీని కలిపి నిద్రించే ముందు పట్టిస్తే సరి. మృదువుగా ఉంటాయి

గాజు సిసాలపై పడిన గీతలు పోవాలంటే


 గాజు సిసాలపై పడిన గీతలు పోవాలంటే
గాజు సిసాలపై పడిన గీతలు పోవాలంటే టూత్పేస్ట్తో లేదా ఏదైనా షాంపుతో రుద్దితే సరి.

సౌందర్య చిట్కాలు

సౌందర్య చిట్కాలు 
బకెట్ గోరువెచ్చని నీటిలో రెండు కప్పుల పాలు చేర్చి, ఆ నీటితో స్నానం చేయడం వల్ల పొడిబారిన చర్మం తాజాదనంతో మెరిసిపోతుంది. 
* అరకప్పు ఓట్స్లో కొద్దిగా పుల్ల పెరుగు చేర్చి స్నానం చేయడానికి ముందు నలుగు పెట్టుకొంటే చర్మంలో పేరుకున్న మృతకణాలు తొలగిపోతాయి

ఫ్లవర్ ప్యాక్ ఫర్ డ్రై స్కిన్



ఫ్లవర్ ప్యాక్ ఫర్ డ్రై స్కిన్
బంతిపువ్వు రెక్కలు ఒక కప్పు, చామంతి రెక్కలు ఒక కప్పు ఉడికించి చిదిమిన క్యారెట్ ఒక కప్పు, వీట్జెర్మ్ ఆయిల్ ఒక టీ స్పూన్.

అరకప్పు నీటిలో బంతిపూల రెక్కలు, చామంతి రెక్కలు వేసి మరిగించి మూతపెట్టి పక్కన ఉంచుకోవాలి. క్యారెట్లో వీట్జెర్మ్ ఆయిల్ కలిపి ఆ మిశ్రమాన్ని పూల రెక్కలు వేసి మరిగించిన నీటిలో వేసి పేస్టులా కలుపుకోవాలి. ఇష్టమైతే రెండు మూడు చుక్కల బాదం నూనె కూడా కలుపుకోవచ్చు. ఆ ప్యాక్ను ముఖానికి, మెడకు, చేతులకు పట్టించి ఆరిన తర్వాత చన్నీటితో కడగాలి. ఈ ప్యాక్ పొడి చర్మాన్ని సాధారణ చర్మాన్ని మృదువుగా, ఆకర్షణీయంగా మారుస్తుంది. ప్యాక్ పట్టించేటప్పుడు పై వైపుకు స్ట్రోక్స్ ఇవ్వాలి. ఇలా చేస్తే ముఖం కండరాలు ఉత్తేజితమై, రక్త ప్రసరణ బాగా జరిగి చర్మం కాంతివంతంగా ఉంటుంది

ఆపిల్ ముక్కలు నల్లబడకుండా ఉండాలంటే

 ఆపిల్ ముక్కలు నల్లబడకుండా ఉండాలంటే


ఆపిల్ ముక్కలు నల్లబడకుండా ఉండాలంటే... కట్ చేసిన ముక్కలకు నిమ్మరసం రాస్తే సరి.

బాదంపప్పు పొట్టు తేలికగా రావాలంటే



 బాదంపప్పు పొట్టు తేలికగా రావాలంటే




పప్పు పొట్టు తేలికగా రావాలంటే... 20 నిమిషాలు వేడి నీటిలో నానబెట్టి ఒలిస్తే చాలు.

పండ్లు తొందరగా పండాలంటే

 పండ్లు తొందరగా పండాలంటే
పండ్లు తొందరగా పండాలంటే న్యూస్ పేపర్లో చుట్టి ఏదైనా గూట్లో గాలి తగలకుండా రెండు రోజుల పాటు ఉంచితే సరి.

చుండ్రు తగ్గి జుట్టు ఒత్తుగా రావాలంటే

 చుండ్రు తగ్గి జుట్టు ఒత్తుగా రావాలంటే
ఒక కప్పు గోరింటాకు, ఉసిరికాయ ముక్కలు పదింటిని నీటిలో రాత్రంతా నానబెట్టి, మరుసటి రోజు గ్రైండ్ చేయాలి. దానిని 200 మి.లీల కొబ్బరి నూనెలో వేసి సన్నని మంట మీద మరగబెట్టి చల్లారిన తర్వాత వడపోసి బాటిల్లో నిలువచేసుకోవాలి. ఈ నూనెను తలకు పట్టిస్తే చుండ్రు తగ్గి జుట్టు ఒత్తుగా, పెరుగు తుంది.

దోసెలు మెత్తగా రావాలంటే

 దోసెలు మెత్తగా రావాలంటే



దోసెలు మెత్తగా రావాలంటే పిండి రుబ్బుకునేటప్పుడు అరకప్పు ఉడికించిన అన్నం, చిటికెడు మెంతిపొడి కలిపితే చాలు.

ముఖం కాంతిమంతంగా ఉండాలంటే

 ముఖం కాంతిమంతంగా ఉండాలంటే
ముఖం కాంతిమంతంగా ఉండాలంటే రెండు టీ స్పూన్ల ఓట్స్లో రెండు టీ స్పూన్ల పచ్చిపాలు అయిదారు చుక్కల తేనె కలిపి మెత్తగా పేస్ట్ చెయ్యాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి 20 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో కడగాలి. ఇలా వారానికి రెండుసార్లు చేస్తే సరిపోతుంది.

వెల్లుల్లిని ఫ్రిజ్‌లో ఉంచితే

 వెల్లుల్లిని ఫ్రిజ్లో ఉంచితే

వెల్లుల్లిని ఫ్రిజ్లో ఉంచితే.. ఎక్కువ కాలం తాజాగా ఉంటాయి. పొట్టు కూడా సులువుగా వస్తుంది.

కూరల్లో ఉప్పు ఎక్కువైతే

 కూరల్లో ఉప్పు ఎక్కువైతే
కూరల్లో ఉప్పు ఎక్కువైతే రెండు టీ స్పూన్ల కార్న్ ఫ్లోర్ కలుపుకుంటే తగ్గుతుంది.

పెరుగులోని పులుపు తగ్గాలంటే

పెరుగులోని పులుపు తగ్గాలంటే



పెరుగులోని పులుపు తగ్గాలంటే ఆరు కప్పుల నీళ్లు పోసి ఆరగంట తర్వాత పై నీటిని తీసేస్తే సరిపోతుంది.

జుట్టు ఒత్తుగా పెరగాలంటే

 జుట్టు ఒత్తుగా పెరగాలంటే
జుట్టు ఒత్తుగా పెరగాలంటే తల స్నానం చేయబోయే గంట ముందు గోరువెచ్చని కొబ్బరినూనెను తలకు పట్టించాలి. తగినన్ని మందార ఆకులను శుభ్రంగా కడిగి గ్రైండ్ చేయాలి. ఆ ముద్దను కూడా తలకు పట్టించి గంట తర్వాత గోరువెచ్చని నీళ్లతో స్నానం చేస్తే జుట్టుకి పోషణ లభించి నల్లగా ఉంటుంది.

పచ్చి బఠాణీల రంగు మారకుండా ఉండాలంటే


 పచ్చి బఠాణీల రంగు మారకుండా ఉండాలంటే

పచ్చి బఠాణీల రంగు మారకుండా ఉండాలంటే బఠాణీలు ఉడుకుతున్నప్పుడు చిటికెడు పంచదార కలపాలి.