ప్రస్తుతం బరువు సమస్య చాలా మంది ని వేధిస్తుంది. దాన్ని తగ్గించుకునే మార్గం లో చాలామంది ప్రాణాలనే పనంగా పెడుతున్నారు. కొవ్వు కరిగించుకోవడం, కోయించుకోవడం ఇలా ఎన్నో రకాల వైద్యాలు ఉన్నా వాటివల్ల ఎదుర్కునే సమస్యలు చాలా ఉన్నాయి. తాజాగా ఒక సినీ తార కూడా ఈ విధానం వికటించి చనిపోయింది.. సఫలమై ఆనందంగా జీవించే వారు ఉన్నారు విఫలమై మరణాన్ని చేరుకున్నవారు ఉన్నారు. ఇవి చేయించుకునేందుకు యోగ్యత లేని వారు ఇంట్లో ఉంటూనే బరువు తగ్గవచ్చు. అధిక బరువు వల్ల ఆరోగ్యపరం గా కూడా మంచిది కాదు. దేని వల్ల అనేక వ్యాధులు తలెత్తుతాయి.
టైమ్ కి భోజనం, రోజూ వ్యాయామం చేస్తూ, ఒత్తిడి కి గురి కాకుండా చూసుకోవాలి. ఇలా రోజు చేయడం వలన బరువుతగ్గె అవకాశం ఉంది. వీటితో పాటు ఒక అధ్బుతమైన పానీయం తాగడం వలన బరువు కచ్చితం గా తగ్గవచ్చు అంటున్నారు నిపుణులు. ఆశ్చర్యం గా అనిపించినా ఇది నిజం.
కావలసినవి:
• నీళ్ళు-8 గ్లాసులు
• అల్లం వేరు -1 టేబుల్ స్పూన్( తరిగినది)
• దోసకాయ-1 (మీడియం)
• నిమ్మకాయ-1
• పుదీనా ఆకులు-12
తయారుచేసే విధానం:
• ముందుగా దోసకాయ తీసుకుని తొక్క ను తీసి , దోసకాయను సన్నగా తరగాలి.
• దానిలో నిమ్మకాయ రసాన్ని కలపాలి.
• ఇప్పుడు విడిగా వేరే ప్లేట్ ని తీసుకొని 12 పుదీన ఆకులని బాగా మెత్తగా పేస్ట్ చేయాలి.
• అన్నిటినీ ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ అల్లం తో బాగా కలిపి రాత్రంతా నానపెట్టాలి.
• ఉదయం లేవగానే 8 గ్లాసుల నీళ్ళు ఆ మిశ్రమం లో కలపాలి.
• దాహం వేసినప్పుడల్లా ఈ జూస్ ని సేవించాలి.
0 comments:
Post a Comment