Saturday, June 11, 2016

ఫ్లవర్ ప్యాక్ ఫర్ డ్రై స్కిన్

Posted by Unknown


ఫ్లవర్ ప్యాక్ ఫర్ డ్రై స్కిన్
బంతిపువ్వు రెక్కలు ఒక కప్పు, చామంతి రెక్కలు ఒక కప్పు ఉడికించి చిదిమిన క్యారెట్ ఒక కప్పు, వీట్జెర్మ్ ఆయిల్ ఒక టీ స్పూన్.

అరకప్పు నీటిలో బంతిపూల రెక్కలు, చామంతి రెక్కలు వేసి మరిగించి మూతపెట్టి పక్కన ఉంచుకోవాలి. క్యారెట్లో వీట్జెర్మ్ ఆయిల్ కలిపి ఆ మిశ్రమాన్ని పూల రెక్కలు వేసి మరిగించిన నీటిలో వేసి పేస్టులా కలుపుకోవాలి. ఇష్టమైతే రెండు మూడు చుక్కల బాదం నూనె కూడా కలుపుకోవచ్చు. ఆ ప్యాక్ను ముఖానికి, మెడకు, చేతులకు పట్టించి ఆరిన తర్వాత చన్నీటితో కడగాలి. ఈ ప్యాక్ పొడి చర్మాన్ని సాధారణ చర్మాన్ని మృదువుగా, ఆకర్షణీయంగా మారుస్తుంది. ప్యాక్ పట్టించేటప్పుడు పై వైపుకు స్ట్రోక్స్ ఇవ్వాలి. ఇలా చేస్తే ముఖం కండరాలు ఉత్తేజితమై, రక్త ప్రసరణ బాగా జరిగి చర్మం కాంతివంతంగా ఉంటుంది

0 comments:

Post a Comment