Sunday, August 7, 2016

ప్రపంచంలో అత్యంత ఖరీదైన నీళ్ళివి.. వాటిని ఎక్కడెక్కడ నుంచి తెస్తారో తెలిస్తే...

Posted by Unknown

ప్రపంచంలో అత్యంత ఖరీదైన నీళ్ళివి.. వాటిని ఎక్కడెక్కడ నుంచి తెస్తారో తెలిస్తే... 
blogger-image-2062227166


గుక్కెడు నీళ్లకోసం ఎన్ని పాట్లు పడాలో ఇప్పుడు అందరికీ తెలిసొచ్చిన వాస్తవమే. ఎండాకాలంలో, కరువు ప్రాంతాల్లో అయితే ఇక ఆ పాట్లు చెప్పనలవికాదు. నీళ్ళు కూడా కొనుక్కుంటారా! అని ఒకప్పుడు విడ్డూరంగా చెప్పుకున్న వాళ్ళు కూడా ఇప్పుడు డబ్బిచ్చి నీళ్ళు తాగాల్సిన పరిస్థితులు దాపురించాయి. నీళ్ళు కొనుక్కోడం అంటే వాటర్ క్యాన్ ఇరవై రూపాయలో, యాభై రూపాయలో ఉంటుందనుకునేరు! మనకు రెండు రూపాయల వాటర్ ప్యాకెట్ల గురించే తెలుసు. కానీ ప్రపంచంలో మంచినీళ్ళు తాగడానికి వేల రూపాయలు ఖర్చు పెట్టేవారున్నారు. 

నిజమా! అని నోరెళ్ళబెట్టకండి. ఎందుకంటే అవేం అల్లాటప్పా నీళ్ళు కాదట! ఆ నీరు తాగితే ఆరోగ్యానికి ఆరోగ్యం, స్వచ్ఛతకు స్వచ్ఛతానట! కాకులు దూరని కారడవుల్లోంచి చీమలు దూరని చిట్టడవుల్లోంచీ ఆ నీటిని తెస్తారట! అసలు ఆ నీటికి అంత ఖరీదు ఎందుకు వచ్చిందో మనం తెలుసుకుంటే ఆశ్చర్చ పోవడమే కాదు, నీటిబొట్టు విలువ, దాని గొప్పతనం మనకి తెలిసొస్తుంది! మనం కోల్పోతున్నదేమిటో తెలు స్తుంది. నీటిని కలుషితం చేయకుండా ఎంత జాగ్రత్త పడాలో కూడా తెలుస్తుంది! 
 
కోనా నిగరి 
కోనానిగరి అనే ఈ బ్రాండ్ నీటి ఖరీదు 27 వేల రూపాయలు! అంతమొత్తం చెల్లిస్తే 750 మి.లీ. వాటర్ బాటిల్ మన సొంతం అవుతుంది! ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన నీళ్ళివి. ఏంటి దీని గొప్ప? అనకండి. ఈ నీరు తాగితే ఆరోగ్యం మెరుగుపడుతుంది. బరువు తగ్గుతాం. చర్మం నిగారింపు వస్తుంది. ఒత్తిడి దూరమవుతుంది. ఈ నీటిని ఎక్కడనుంచి తెస్తారో తెలుసా? హవాయి దగ్గర్లోని పసిఫిక్ సముద్ర తీరంలో రెండువేల అడుగుల లోతు నుంచి తోడుకొస్తారు! ప్రత్యేక పద్ధతుల్లో ఉప్పును పోగొట్టి బాటిళ్ళలో నింపుతారు. సముద్రం అడుగున వేల అడుగుల లోతు నుంచి బయ టకు తీయడంవల్ల ఈ నీరు స్వచ్ఛంగా ఉంటుంది. ఈ నీటిలో ఖనిజ లవణాలు ఎక్కువ మోతాదులో ఉంటాయి. ఈ నీటికి జపానలో మహా డిమాండ్. రోజుకు 80 వేలకు పైగా బాటిళ్ళు అక్కడకు దిగుమతవు తాయి. 
 
బ్లింగ్ హెచ్టూవో 
ఇంత ఖరీదైన నీళ్ళు తాగే వారిలో ఎక్కువగా ఉండేది సెల బ్రిటీలే. బ్లింగ్ హెచటువో కంపెనీ వాటర్ బాటిల్ కూడా ఎంతో ఆకర్ష ణీయంగా ఉంటుంది. ఈ బాటిల్ ఖరీదు 2,680 రూపాయలు. ఈ నీటిని టెనెస్సీ దగ్గ రున్న నీటి బుగ్గల నుంచి సేకరిస్తారు. ఈ జలంతో నింపే ఈ బాటిళ్లను స్వరోవ్స్కీ రాళ్ళతో తీర్చి దిద్దుతారు. 
 
ఫిన్లాండ్ వీన్ వాటర్ 
ఫిన్లాండ్కు చెందిన వీన కంపెనీ ఈ నీరు విక్రయిస్తోంది. 750 మిల్లీ లీటర్ల ఈ బాటిల్ ధర 1500 రూపాయలు. పచ్చదనం, స్వచ్ఛమైన వాతావరణం ఉన్న ప్రాంతాల్లోని నీటి బుగ్గల నుంచి ఈ జలం సేకరిస్తారు. ప్రపంచంలోనే ప్రకృతి సంపద ఎక్కువ ఉన్న దేశంగా గుర్తింపు పొందిన భూటానలోని హిమా లయ ప్రాంతం నుంచి ఈ నీటిని సేకరించి వివిధ దేశాలకు ఎగుమతి చేస్తున్నారు 
 
మంచునుండి తీసిన ఖరీదైన నీరు 
కెనడాలోని వాంకోవర్ నగరానికి 200 మైళ్ళ దూరంలో ఉన్న పర్వత ప్రాంతంలో జనసంచారం, జంతు సంచారం ఉండదు. అక్కడ ఆరువేల అడు గుల లోతుతో వాలుగా ఉండే హిమనీనదాలను కరిగించి మంచినీరు బాటిళ్ళలో నింపుతోంది 10 థౌజండ్ కంపెనీ. 750 మిల్లీలీటర్ల ఈ నీటి బాటిల్ ఖరీదు కేవలం 950 రూపాయలే. నిర్మానుష్యమైన పర్వతప్రాంతం కాబట్టి ఆ నీరు కలుషితం కాదు. పైగా హిమనీనదాల నీరు. ఈ నీరు తాగితే రోగనిరోధక శక్తి పెరుగుతుందనీ, చర్మం మీద ముడుతలు రావనీ చెబుతోందీ టెన్ థౌజండ్ కంపెనీ. 
 
ఆక్వాడెకా 
10 థౌజండ్ బీసీ వాటర్లాగే కెనడాకు చెందిన ఆక్వాడెకా కంపెనీ కూడా హిమానీ నదాల నుంచే నీటిని సేకరిస్తుంది. సుమారు 18 వేల సంవత్సరాల కిందట ఘనీభవించిన హిమనీ నదాల నుంచి సేకరించిన నీరిది. ఉత్తమ నాన కార్బొనేటెడ్ స్ర్పింగ్ వాటర్గా 2007లో బంగారు పతకాన్ని కూడా సాధించింది ఈ కంపెనీ. 750 మి.లీ ఈ వాటర్ బాటిల్ ఖరీదు 800 రూపాయలు. 
 
ఏవియాన్
ఈ ఫ్రాన్స్ కంపెనీ నీటి ధర లీటరుకు ఆరు వందలకు పైమాటే. క్రికెట్ మ్యాచల సమయంలో విరాట్ కోహ్లీ కోసం తప్పనిసరిగా ఏవియాన్ బ్రాండ్ నీరు తెప్పించాల్పిందేనట. 1789లో ఫ్రాన్సకు చెందిన మార్కిస్ అనే వ్యక్తి రోజూ వాకింగ్కి వెళ్తూ ఏవి యానలెస్ బెయిన్స దగ్గరున్న నీటి బుగ్గలో నీరు తాగే వాడట. ఆ నీరు తాగడం మొదలుపెట్టాక అతడికున్న కిడ్నీ లివర్ సమస్యలు నయమయ్యాయట. అది కాస్తా ప్రచారం కావడంతో ఆ నీటిని అమ్మడం వ్యాపారంగా మారింది. అదే తర్వాతి కాలంలో ఏవియన బ్రాండ్గా విస్త రించింది. చాలామంది ప్రముఖులు ఈ నీటిని ప్రత్యేకంగా తెప్పించుకుని తాగుతారు. మన దేశంలోనూ ఆనలైన ద్వారా ఈ బాటిళ్ళు అమ్ముతున్నారు. 
 
లాక్వెన్ ఆర్టెస్ వాటర్ 
ఈ నీటి ధర 400 రూపాయలు. దక్షిణ అమెరికాలోని ఆండీస్ పర్వతాల దగ్గర ఎలాంటి కాలుష్యం లేని మారుమూల ప్రాంతంలో 1500 అడుగుల లోతుకు వెళ్ళి తవ్వి తీసిన నీరే లాక్వెన్ మినరల్ వాటర్. బాటిల్లో నింపే వరకూ గాలి కూడా తాకనంత స్వచ్ఛంగా ఉంటాయట ఈ నీళ్ళు.

0 comments:

Post a Comment