Sunday, August 7, 2016

హెచ్ఆర్‌లు అడిగే ట్రికీ ప్రశ్నలివే!

Posted by Unknown
హెచ్ఆర్లు అడిగే ట్రికీ ప్రశ్నలివే!


ఏ కంపెనీలోనైనా హెచ్ఆర్ ఇంటర్వ్యూ చివరిదై ఉంటుంది. ఈ సందర్భంలో ప్రతి అభ్యర్థి మైండ్లోనూ ఒక్కటే ప్రశ్న మెదలుతూ ఉంటుంది. హెచ్ఆర్ ఏయే ప్రశ్నలు వేస్తారా అని! ఎటువంటి కన్ఫ్యూజన్ లేకుండా, సూటిగా, స్పష్టంగా హెచ్ఆర్కు సమాధానాలు ఇవ్వడం ఫ్రెషర్స్కు అంత తేలికేమీ కాదు... టాప్ కంపెనీల్లో హెచ్ఆర్లు అడిగిన ప్రశ్నలు ఇలా ఉన్నాయి...
1. మీ గురించి చెప్పండి...!
ఇది చాలా జనరల్గా అన్ని ఇంటర్వ్యూల్లోనూ అడిగే ప్రశ్న... అయితే, ఇది చాలా ట్రికీ ప్రశ్న! మీరు ఈ ఉద్యోగానికి ఎలా క్వాలిఫైడో చెప్పడం ప్రారంభించాలి... ఇక్కడ గుర్తంచుకోవాల్సింది ఏమిటంటే... మీ విద్యార్హతలు, అనుభవం ఆ పోస్టుకు సరిపోతాయా లేదా అని హెచ్ఆర్ గమనిస్తున్నాడని! అయితే, మీరు గడగడా చెప్పినా అది ముందే రిహార్సల్ చేసుకున్నట్టు ఉండకూడదు!!
2. మీ గ్రేటెస్ట్ స్ట్రెంగ్త్స్ ఏమిటి? 
మీరు ఎన్ని చెప్పినా మంచిదే! కాని, అవి పాజిటివ్గా ఉండాలి... అంటే, ప్రాబ్లెం సాల్వింగ్ స్కిల్స్, కష్టపడి పనిచేయడం, ఫ్రొఫెషనల్ ఎక్స్పర్టైజ్, లీడర్షిప్ స్కిల్స్, పాజిటివ్ యాటిట్యూడ్... తదితర అంశాల గురించి చెప్పాలి.
3. మీరు ఏ విషయంలో వెనుకబడి (blind spots) ఉన్నారు?!
లోపాయికారి ప్రశ్న! జాగ్రత్త... మీ బలహీనతల గురించి అడుగుతున్నారంటే... షార్ట్ లిస్ట్ చేయడానికి, మిమ్మల్ని ఎలిమినేట్ చేయడానికి చూస్తున్నారని అర్ధం చేసుకుని సమాధానం జాగ్రత్తగా చెప్పాలి...
4. మీకెందుకు ఈ ఉద్యోగం ఇవ్వాలి?
ఈ ప్రశ్నను మీరు అడ్వాంటేజ్గా తీసుకోవాలి... కంపెనీ అవసరాలు, డిమాండ్ ఏంటో అర్ధం చేసుకోండి... ఎవరో ఒకరిని కాకుండా మిమ్మల్నే ఎందుకు తీసుకోవాలో మీ స్ట్రెంగ్త్స్ అండ్ స్కిల్స్ గురించి సూటిగా, స్పష్టంగా చెప్పండి.
5. ఇంతకుముందు ఉద్యోగాన్ని ఎందుకు మానివేశారు?
ఈ ప్రశ్నకు మీరు పాజిటివ్గా జవాబివ్వాలి... మీ మాజీ బాస్ లేదా కంపెనీ గురించి నెగెటివ్గా, బ్యాడ్గా ఎప్పుడూ, ఎక్కడా చెప్పకండి. సరైన కారణం చెప్పండి.
6. మరో అయిదేళ్లలో మీరు ఏ పొజిషన్లో ఉంటారని భావిస్తున్నారు?
మరీ స్పెసిఫిక్గా ఉండకండి... లాంగ్ టెర్మ్ కమిట్మెంట్ ఇవ్వకండి... ఇదే పొజిషన్ కోసం చూస్తున్నట్టు మాత్రమే చెప్పండి.
7. కంపెనీకి మీరు ఏవిధంగా ఎస్సెట్ అవుతారు?
ఈ ప్రశ్నను కూడా మీరు అడ్వాంటేజ్గా తీసుకోవాలి. మీ బలబలాలను, స్కిల్స్ ను వివరిస్తూ హెచ్ఆర్ లేదా ఇంటర్వ్యూయర్లో కాన్ఫిడెన్స్ నింపండి...
8. మీరేమైనా ప్రశ్నలు అడుగుతారా?
జాగ్రత్త! అడ్వాంటేజ్ తీసుకుని పిచ్చి ప్రశ్నలు అడగకండి... నేనెప్పుడు డ్యూటీలో జాయిన్ కావచ్చు... ఇలాంటి ప్రశ్నలు అడగండి... ఇంకా మీ మేనేజ్మెంట్ గురించి, టెక్నికల్స్ గురించి ప్రశ్నలు ఉంటాయి...

0 comments:

Post a Comment