Sunday, August 7, 2016

ఇంటర్వ్యూల్లో సెవెన్ డెడ్లీ మిస్టేక్స్!

Posted by Unknown
blogger-image-949080923



ఇంటర్వ్యూలకు వెళ్లినప్పుడు తెలిసో తెలియకో అభ్యర్థులు చేసే తప్పుల్లో సరిచేసుకోలేని ఏడు తప్పులివే...
1. ఆలస్యంగా వెళ్లడం...
ఎక్కడైనా ఆలస్యమైతే ఫరవాలేదేమో కాని, ఇంటర్వ్యూకి ఆలస్యంగా వెళితే అసలుకే మోసం వస్తుంది. సమయానికి వెళ్లకపోతే 'మీ స్వభావం ఇంతే' కావచ్చునని హెచ్ఆర్ భావించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మీకు ఉద్యోగం ఇచ్చి మీపై ఆధారపడడం సాధ్యం కాదk
న్న నిర్ణయానికి వచ్చేస్తారు. సో... ఇంటర్వ్యూ సమయం కంటే ముందుగానే అక్కడికి చేరుకుని కొద్దిసేపు రిలాక్స్ అయితే మీకే మంచిది.
2. మాజీ బాస్ని తిట్టిపోయడం...
ఇంతకుముందు చేసిన ఉద్యోగం ఎందుకు మానివేశారో చెప్పేటప్పుడు మీ నోరు జాగ్రత్త! బాస్ క్రేజీ అనో, కంపెనీ మేనేజ్మెంట్ మంచిది కాదనో, అవినీతిపరులనో చెప్పుకుంటూ వాచాలత్వానికి పోయారనుకోండి... ఇంటర్వ్యూ చేస్తున్న వారికి మీపై దురభిప్రాయం ప్రబలిపోతుంది... మంచికైనా, చెడుకైనా... మీ మాజీ బాస్ గురించి, కంపెనీ గురించి చెడుగా మాట్లాడకుండా ఉండడమే ఉత్తమం. తమ కంపెనీకి సంబంధించి ఆయా సందర్భాలలో మీరెలా స్పందిస్తారన్నది మీ వాచాలత్వాన్ని బట్టి హైరింగ్ మేనేజర్లు నిర్ణయించుకుంటారు!
3. మీరెలా రాణిస్తారో ఉదాహరణలతో చెప్పాలి...
మీరు ఇన్నోవేటివ్ జీనియస్ లేదా గ్రేట్ స్ట్రాటజిస్ట్ అయితేనో సరిపోదు... మీరెలా రాణిస్తారో, గోల్స్ ఎలా సాధిస్తారో ఉదాహరణలతో సహా మీ స్కిల్స్ గురించి చెప్పుకోగలగాలి. లేకపోతే మీకు మంచి మార్కులు పడవని గ్రహించండి... సో, ఇంటర్వ్యూకు వెళ్లే ముందే మీరు సంసిద్ధులై ఉండాలి.
4. అసందర్భ జోక్స్కి తావులేదు!
ఇంటర్వ్యూ సమయంలో హెచ్ఆర్ లేదా మేనేజర్ మీ స్వభావాన్ని అంచనా వేస్తూ ఉంటారు. క్లిష్ట సమయాల్లో మీరెలాంటి నిర్ణయం తీసుకుంటారన్నదే వారికి కావలసింది... ఇందుకోసం వారు మీతో ఫ్రెండ్లీగా మూవ్ అవుతూ, అప్పుడప్పుడు అసందర్భ జోకులు కూడా పేలుస్తుంటారు... అయితే, వీటి వెనుక ఒక వ్యూహం ఉందని గ్రహించకపోతే అంతేసంగతులు! జాబ్ ఇచ్చిన తర్వాత మీరు రాణించగలరా, షో నటిస్తున్నారా అనేది వారు ఇట్టే పసిగట్టేస్తారు!
5. మీరూ ప్రశ్నించాలి!
ఉద్యోగం వచ్చిన తర్వాత ఇదే కంపెనీలో, ఇదే ఉద్యోగంలో, ఇదే మేనేజర్తో మీరు రోజుకి ఎనిమిది గంటలు గడపాలి. మిమ్మల్ని ఇంటర్వ్యూ చేసేవారు మీరు ఏం అడుగుతారా అని ఎదురుచూస్తుంటారు. జాబ్ గురించిన డిటైల్స్, డిపార్ట్ మెంట్ డిటైల్స్, అక్కడి సహచరులు, సూపర్ వైజర్ల గురించి, ఆర్గనైజేషన్ వర్క్ కల్చర్ గురించి మీరు అడగాలి! ఒకవేళ మీరేమీ అడగకపోతే మీకు ఇంటరెస్ట్ లేదనో లేకపోతే జాబ్ గురించి అంతగా ఆలోచించడం లేదనో భావిస్తారు. కాబట్టి, ఇంటర్వ్యూకు వెళ్లే ముందే అర్ధవంతమైన, ఆలోచనాత్మకమైన ప్రశ్నలు ఏమడగాలో ప్రిపేర్ కండి!
6. కోపం, విసుగు పనికిరాదు!
ఉద్యోగం వెతుకులాట కష్టమే... నిరుత్సాహం కలగడం సహజమే... కాని, జాబ్ సెర్చ్లో మీరు కోపం, విసుగు ప్రదర్శిండం లేదా మాజీ బాస్ గురించి నెగెటివ్గా స్పందిస్తే మీకే నష్టం... మంచి కంపెనీల నుంచి మీకు ఆఫర్ లు వచ్చే అవకాశం కోల్పోతారు... కోపంతో చిరచిరలాడే వారిని ఉద్యోగంలో పెట్టుకుందామని ఎవరూ అనుకోరు కదా!
7. ఫ్రెండ్లీగా, కలుపుగోలుగా ఉండాలి...
తమ ఉద్యోగులు ప్లెజెంట్గా ఉండాలనే ఎవరైనా కోరుకుంటారు. అయితే... మీరు బిగుసుకుపోయి, అహంతో మెరటుగా ఉంటే మీకెన్ని క్వాలిఫికేషన్లు ఉన్నా ఉపయోగం లేదు! ఫ్రెండ్లీగా, కలుపుగోలుతనంగా సహచరులతో ఉంటారని భావిస్తేనే మీకు ఉద్యోగం ఇస్తారు... సో, బి కేర్ ఫుల్!

0 comments:

Post a Comment