Sunday, August 7, 2016

వీటికి సరైన ఆన్సరిస్తే జాబ్ వచ్చినట్టే!?

Posted by Unknown


blogger-image-581639535

అన్ని ఇంటర్వ్యూలను వడపోసిన అనలిస్టులు కేవలం నాలుగంటే నాలుగు ట్రికీ ప్రశ్నలనే కంపెనీలు తిప్పి తిప్పి అడుగుతుంటాయని తేల్చారు!
ఈ నాలుగు ట్రికీ ప్రశ్నలకు సరైన సమాధానాలిస్తే ఏ అభ్యర్థికైనా జాబ్ దాదాపు వచ్చేసినట్టే!
మరి, అవేంటో మీకోసం ప్రత్యేకంగా...
1. మీ గురించి చెప్పండి!
ఈ ప్రశ్న వినడానికి చాలా సాధారణంగా అనిపించినా, ఇందులో సముద్రం అంతా లోతుంది! ఈ ప్రశ్నలోని అంతరార్ధం కంపెనీకి మీ వల్ల ఎటువంటి లాభం చేకూరుతుందని ఎంప్లాయర్ భావిస్తున్నాడన్నమాట!
ఈ ప్రశ్నకు మీరు చాలా క్లుప్తంగా, సింపుల్గా సమాధానం ఇవ్వాలి...
మీరు అప్లై చేసిన ఉద్యోగానికి సంబంధించి మీకున్న అనుభవాన్ని సూటిగా, స్పష్టంగా చెప్పండి...
అలాగే, మీరు ఆ ఉద్యోగం ద్వారా కంపెనీకి ఏం సాధించి పెడతారో స్పష్టం చేయండి...
మీ రెజ్యూమ్లో పేర్కొన్న అంశాలనే సమ్మరైజ్ చేయండి... మధ్యలో ఖాళీగా ఉంటే ఎందుకు ఉండాల్సి వచ్చిందో కన్విన్సింగ్గా చెప్పండి...
2. ఇంతకుముందు ఉద్యోగాన్ని ఎందుకు మానేశారు?
ఇది కూడా రొటీన్ క్వశ్చన్ కానే కాదు... మీరు ఇంతకుముందు కంపెనీ నుంచి ఎందుకు, ఏవిధంగా మానివేయాలని నిర్ణయించుకున్నదీ తెలుసుకుని మీ గురించి ఒక అంచనాకు రావడానికే ఈ క్వశ్చన్!
మీరు ఇప్పటికీ ఉద్యోగం చేస్తుంటే... ఇంకా మంచి అవకాశం కోసమేనని చెప్పాలి...
ఒకవేళ మీరు ఉద్యోగం పోగొట్టుకుని ఉంటే... వేరే అవకాశాల కోసం చూస్తున్నానంటూ, మీరు సాధించిన విజయాల గురించి చెప్పండి...
3. మీరెంత శాలరీ ఆశిస్తున్నారు?
మిమ్మల్ని మీరు సరిగ్గా ప్రజెంట్ చేసుకోగలుగుతున్నారా, లేదా అని ఎంప్లాయర్ చూస్తున్నాడన్నమాట!
అత్యాశకు పోయి ఎక్కువ శాలరీ అడగొద్దు... అలాగని మరీ తక్కువకు కూడా సిద్ధపడవద్దు... 
నెగోషియబుల్ అనే చెప్పండి... ఇదే పొజిషన్లో ఇతరులకు ఎంత శాలరీ ఇస్తున్నదీ ముందుగానే తెలుసుకోండి... అంతే ఆశించండి...
4. మీ భవిష్యత్ గోల్స్ ఎమిటి?
మీరిచ్చే సమాధానాన్ని బట్టే మీరు తమ కంపెనీకి సరిపోతారా, లేదా అని కంపెనీలు నిర్ణయించుకుంటాయి...
మరింతగా రాణించడం, మరిన్ని స్కిల్స్ నేర్చుకోవడం...
కంపెనీలో ఎంత బాధ్యతాయుతంగా పనిచేయాలనుకుంటున్నదీ చెప్పడం...
ఏవిధంగా పాజిటివ్ రిజల్ట్స్ రాగలిగేదీ సూటిగా, ధీమాగా చెప్పడం... ఇందుకు సరైన ఉదాహరణలు ఇవ్వడం...
ఈ నాలుగు ప్రశ్నలకు సరైన సమాధానాలివ్వగలిగితే దాదాపు జాబ్ వచ్చేసినట్టే...!

0 comments:

Post a Comment