Tuesday, February 22, 2022

Beetroot Benifits

Posted by Unknown
Read More

Thursday, August 3, 2017

Seven Stages Of Falling In Love With Someone

Posted by Unknown

Hey, you beautiful person.  

Hope you’re doing well.

 

We all think that falling in love will feel like that whirlwind which will take us on the roller-coaster ride of our lives.

 

Those fluttery feelings, those butterflies in your stomach when you see someone special, the craving to meet each other at midnight, are all symptoms that Cupid’s arrow has hit its mark and you’ve fallen in love.

 

And if there’s one thing that all these symptoms make pretty clear it’s that love is actually a very twisted concept, for it doesn’t give you the time to analyze and introspect. It just happens, and before you know it, you have already fallen head over heels in love with this new, crazy and beautiful soul who has made your life A LOT BRIGHTER.

 

So, for all you mush pots out there who think that they have started more than just ‘liking’ someone, here is a list of seven stages one goes through, while falling in love:

1. Physical attraction.

 

There is no denying the fact that the first stage of falling in love is the infatuation you feel towards the other person. It’s this attraction that ignites that initial spark which later manifests into some great chemistry between you two. 

 

Whether it’s her long sexy legs and captivating eyes or his killer height, wide shoulders or No Shave November look, we shallow beings can agree that, initially, good looks do make our eyes drool.

 

2. The ‘me too’ stage.

 

Someone has rightly said, there is nothing more erotic than a good conversation.

 

This is the second stage of falling in love. When you find yourself in sync on different levels, it’s more likely that you end up talking to them a little more than you would with a normal person. After all, intimacy of the mind is rare and difficult to find.

 

3. The Exploring Phase.

 

In this internet age, one's life is dominated by interactive social media websites like Facebook, Instagram and Twitter and taking utmost advantages of this, you find yourself checking him or her out on every possible platform.

 

This is mostly done in order to run a background check, to find out who their friends are, to see if you both have any mutual friends, to find out where they work, who their closest pals are, etc. This can also be briefly summed up as the ‘Exploring Phase'.

 

I'm glorifying stalking here. I know. But everything is fair in love.

4. Affection.

It’s only human to develop a sense of care and affection for this beautiful soul who just entered your world and made your life a little sunnier and warmer.

 

Good news, bad news or no news - you want to share it all. After all, their special occasions are your special days too now.

 

5. The Butterfly Effect.

 

The way your heart flutters when he/she holds your hand on busy streets, the way he/she brushes the hair from your eyes, how he/she doesn't get tired of your non-stop blabbering, those stolen kisses, the interlocked fingers, random texts that make your day a little brighter and your smile a little wider.

 

6. The Sun in your Rainbow.

 

Remember the times when you failed a test or had a fight with your best friend? They were the ones you turned to.

 

No one knows how to pep you up better than him/her and so all you lovelies out there, if he/she cares for you, checks on you often, sticks with you during the bad days and makes you smile a little wider, he/she is the one.

 

7. Seal the Deal.

Yes! You read that right. He/she is the one you have been waiting for, the kind of love that all those Yash Raj movies talk about. Hold on to that twisted amazing person sweetheart, for he/she is the one who makes your heart hiccup and miss a beat at the same time.

Read More

Monday, February 27, 2017

Jobs in Canara Bank

Posted by Unknown



కెనరా బ్యాంకులో కాంట్రాక్టు ఉద్యోగాలు


కెనరా బ్యాంక్‌ కాంట్రాక్టు పద్ధతిపై కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

సీనియర్‌ రిస్క్‌ ఆఫీసర్‌ (ఎస్‌ఆర్‌ఒ)
అర్హతలు: గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి మాస్టర్స్‌ డిగ్రీ (మ్యాథ్స్‌/ స్టాటిస్టిక్స్‌/ ఎకనామిక్స్‌/ ఎంబిఎ (ఫైనాన్స్)/ ఎంబిఎ (బ్యాంకింగ్‌ & ఫైనాన్స్)/ పిజి డిప్లొమా

చీఫ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ఆఫీసర్‌
అర్హతలు: గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి మాస్టర్స్‌ డిగ్రీ/ సిఎ/ సిఎఫ్‌ఎ(యుఎస్‌ఎ)/ సిఎస్‌/ ఐసిడబ్ల్యుఎఐ/ ఎంబిఎ/ బిఇ/ బిటెక్‌

చీఫ్‌ టెక్నాలజీ ఆఫీసర్‌ (సిటిఒ)
అర్హతలు: గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి డిగ్రీ/ పిజి (కంప్యూటర్‌ సైన్స/ కంప్యూటర్‌ టెక్నాలజీ/ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ/ ఎలక్ట్రానిక్స్‌ & కమ్యూనికేషన్) లేదా ఎంబిఎ

వయసు: 55 సంవత్సరాలు (1.1.2017 నాటికి)

కాంట్రాక్టు కాలవ్యవధి: మూడు సంవత్సరాలు

ఎంపిక విధానం: పర్సనల్‌ ఇంటర్వ్యూ ద్వారా

దరఖాస్తు విధానం: డౌన్‌లోడ్‌ చేసిన దరఖాస్తును పూర్తిచేసి సంబంధిత డాక్యుమెంట్లు జతపరిచి కింది చిరునామాకు పంపాలి.

దరఖాస్తు ఫీజు చెల్లించడానికి ఆఖరు తేదీ: మార్చి 4

పూర్తిచేసిన దరఖాస్తు కాపీ చేరడానికి ఆఖరు తేదీ:మార్చి 10

చిరునామా: Canara Bank, Recruitment Cell, Human Resources Wing, Head Office, 113/1, Jeevan Prakash Building, J C Road, Bangalore-560002, Karnataka

స్పోర్ట్స్‌ కోటా కింద క్లరికల్‌, ఆఫీసర్‌ పోస్టులు
మొత్తం ఖాళీలు: 20

క్రీడాంశాలు-ఖాళీలు: అథ్లెటిక్స్‌ 4, క్రికెట్‌ 5, హాకి 7, షటిల్‌ బ్యాడ్మింటన 2, టేబుల్‌ టెన్నిస్‌ 2

అర్హత: ఫిబ్రవరి 1 నాటికి క్లరికల్‌ పోస్టులకు ఇంటర్‌, ఆఫీసర్స్‌ పోస్టులకు డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.

వయసు: క్లరికల్‌కు 18 నుంచి 28 ఏళ్ల మధ్య, ఆఫీసర్స్‌కు 20 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి.

ఎంపిక: అకడమిక్‌ మెరిట్‌, స్పోర్ట్స్‌ పర్ఫార్మెన్స్, ఇంటర్వ్యూ ద్వారా

దరఖాస్తు చేరేందుకు ఆఖరు తేదీ: మార్చి 10
చిరునామా: The Deputy General Manager, Canara Bank, Personal Management Section, Human Resource Wing, #112, JC Road, Bangalore - 560002
వెబ్‌సైట్‌: www.canarabank.com



Read More

Tuesday, December 6, 2016

ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ 60వ వర్థంతి- ఆయన గురించి తప్పక తెలుసుకోవాల్సిన అంశాలు

Posted by Unknown



*🌹🙏🌹✊✊✊ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ 60వ వర్థంతి-  ఆయన గురించి తప్పక తెలుసుకోవాల్సిన అంశాలు ❤❤❤*


*(దయచేసి చదవండి - తరువాత తరాలకు తెలియజేయండి)*

🙏👏🏻🙏👏🏻🙏👏🏻🙏


✿✿ జీవన చిత్రం ✿✿

☞ తల్లిదండ్రులు :- తల్లి భీమాబాయి సక్పాల్, తండ్రి రాంజీ మాలోజీ సక్పాల్ బ్రిటీష్ ఆర్మీలో సుబేదార్ గా పని చేసేవారు. వీరి స్వంత గ్రామం అంబెవాడ గ్రామం, రత్నగిరి జిల్లా, మహారాష్ట్ర.

☞ జననం:- 14 ఏప్రిల్ 1891

☞ ప్రాంతం :- మావ్, సెంట్రల్ ప్రావిన్స్ (ప్రస్తుత మధ్య ప్రదేశ్) ( రాంజీ సక్పాల్ గారు ఉద్యోగం చేస్తున్న ప్రాంతం)

☞ వివాహం:- 

* రమాబాయి అంబేద్కర్:- 1906 లో వివాహం జరిగింది, ఆయన ప్రతి విజయంలో పూర్తి సహకారం అందించారు, తాను చిరిగిన దుస్తులు ధరిస్తూ కూడా బాబాసాహెబ్ చదువుకు, ఆయన చేసే కార్యక్రమాలకు ఏనాడూ ఆటంకం కాలేదు., చివరికి రక్త హీనతతో 1935 సంవత్సరంలో చనిపోయారు.

* సవిత అంబేద్కర్ :- అసలు పేరు శారద కబీర్, రాజ్యాంగ రచన సమయంలో నిద్రలేమి, కాళ్ళలో కండరాల సమన్య వలన  దెబ్బ తిన్న ఆరోగ్యన్ని దగ్గర ఉండి చూసుకోవడం కోసం 15 ఏప్రిల్ 1948 న వివాహం చేసుకున్నారు..

☞ మరణం:- రాజకీయ పరిస్థితులపై, తన అనుచరులు అనుకున్న వారి వ్యవహర శైలి వలన తీవ్రమైన మానసిక వత్తిడిని అనుభవించారు, నిద్రలేమి, మానసిక వత్తిడి వలన కలిగిన తీవ్రమైన మధుమేహ వ్యాధితో బాధ పడ్డారు .

     తన ఆఖరి పుస్తకం "Buddha and his Dhamma" పూర్తి చేసిన మూడు రోజులకు, 1956 డిసంబర్ 06 న నిద్రలోనే పరినిర్వాణం చెందారు


☞✿ బాబాసాహెబ్ చదువులు - ప్రత్యేకతలు:- ✿☜


✍ మెట్రికులేషన్ -1908 

✍ B.A - (Politics and Economics) Bombay University in 1912 - అంటబడని కులాల నుండి మొట్టమొదటి గ్రాడ్యుయేట్

✍ M.A - (Economics - For his thesis ‘Ancient Indian Commerce’) in America in 1915.

✍ Ph.d - (Economics - For his thesis ‘The evolution of provincial finance in British India’) in Columbia University, America in 1917. - ఆర్థిక శాస్త్రంలో ఆసియా ఖండం నుండి  మొట్టమొదటి డాక్టరేట్.

✍ D.Sc - (Thesis - ‘Problem of the Rupee - Its origin and its solution’) in London School of Economics in 1923. ఆర్ధిక శాస్త్రంలో D Sc తీసుకున్న మొదటి మరియు ఆఖరి భారతీయుడు

✍ M.Sc – (Economics – For his thesis ‘Provincial Decentralisation of Imperial Finance in British India’) London. - ఆర్ధిక శాస్త్రంలో మొదటి డబల్ డాక్టరేట్

✍ Bar-At-Law - Gray’s Inn in London, 1923. మొట్టమొదటి ప్రపంచ స్థాయి న్యాయవాది

✍ Political Economics - Germany. 

✍ LLD - (Honoris) Columbia University, New York, For his achievements of leadership and authoring the Constitution of India. 

✍ D.Litt - (Honoris) Osmania University, Hyderabad, For his achievements, Leadership and writing the constitution of India.

✍ బాబాసాహెబ్ తన జీవిత కాలంలో 20000 పుస్తకాలు సేకరించారు., అమెరికా నుండి తిరిగి వచ్చే సమయంలో ఆయన పుస్తకాలు తీసుకొస్తున్న నౌకను జర్మనీ సబ్మెరైన్ దాడి చేసి ముంచేయడంతో దాదాపు 6000 పుస్తకాలు పోగొట్టుకున్నారు., ఆ సమయంలో బాబాసాహెబ్ చాలా బాధ పడ్డారు.


✿✿ తెలిసిన బాషలు -9 భాషల్లో బాబాసాహబ్ పూర్తి ప్రావిన్యత కలిగి ఉన్నారు ✿✿


- మరాఠీ 

- హిందీ

- ఇంగ్లీషు 

- గుజరాతీ

 పాళీ (- పాళీ వ్యాకరణం మరియు నిఘంటువు కూడా రాసారు )

- సంస్కృతం 

- జర్మన్

- పార్శీ

- ఫ్రెంచ్ 


✿✿ బాబాసాహెబ్ ఉద్యమ జీవితం ✿✿


☞☆ బాబాసాహెబ్ స్థాపించిన ఉద్యమ సంస్థలు:-


1. బహిషృిత హితకారిణి సభ :-  జులై 20, 1924

2. సమత సైనిక్ దళ్ :- మార్చి 13, 1927


☞☆ బాబాసాహెబ్ స్థాపించిన రాజకీయ సంస్థలు:-


1. ఇండిపెండెంట్ లేబర్ పార్టీ (ILP)-- ఆగస్టు 16, 1936

2. షెడ్యూల్డ్ క్యాస్ట్ ఫెడరేషన్ (SCF)-- జులై 19, 1942 ( ILP నే SCF గా మార్చారు)

3. రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా (RPI) - అక్టోబరు 3, 1957 (బాబాసాహెబ్ అనారోగ్యం కారణంగా ఆయన తదనంతరం నెలకొల్పబడింది)


☞☆ బాబాసాహెబ్ స్థాపించిన విధ్యా సంస్థలు


1. డిప్రెస్డ్ క్లాస్ ఎడ్యుకేషన్ సొసైటీ -- జూన్ 14, 1928

2. పీపుల్స్ ఎడ్యుకేషన్ సొసైటీ -- జూలై 08, 1945 

3. సిద్ధార్థ్ కాలేజి, ముంబై -- జూన్ 20, 1946 

4. మిళింద్ కాలేజీ, ఔరంగాబాద్ -- జూన్ 01, 1950


☞☆ బాబాసాహెబ్ స్థాపించిన ధార్మిక సంస్థ 


1. బుద్ధిస్టు సొసైటీ ఆఫ్ ఇండియా -- మే 4, 1955


✿✿ బాబాసాహెబ్ నాయకత్వం వహించిన కొన్ని ముఖ్య ఉద్యమాలు ✿✿


- మహద్ చెరువు ఉద్యమం -20/3/1927

- మొహాళీ (ఘులేల)తిరుగుబాటు -12/2/1939

- అంబాదేవీ మందిరం ఆందోళన -26/7/1927

- పూణే కౌన్సిల్ ఉద్యమం - 4/6/1946

- పర్వతీ ఆలయ ఉద్యమం -22/9/1929

- నాగపూర్ ఆందోళన - 3/9/1946

- కాలారామ్ ఆలయ ఆందోళన -2/3/1930

- లక్నౌ ఉద్యమం - 2/3/1947

- ముఖేడ్ ఉద్యమం -23/9/1931


✿✿ బాబాసాహెబ్ స్థాపించిన పత్రికలు ✿✿


*- మూక్ నాయక్ - జనవరి 31, 1920

*- బహిషృిత భారత్ - ఏప్రిల్ 3, 1927

*- సమత - జూన్ 29, 1928

*- జనత - నవంబరు 24, 1930

*- ప్రభుద్ధ భారత్ - ఫిబ్రవరి 4, 1956


✿✿ బాబాసాహెబ్ ప్రత్యేకతలు - దక్కిన గౌరవాలు ✿✿ 


☞- బాబాసాహెబ్ తన జీవిత కాలంలో 527 ప్రసంగాలు చేసారు., ప్రతి ప్రసంగం అత్యంత ప్రభావితం చేయగలిగేవే..

☞- లండన్ యూనివర్సిటీ లైబ్రరీలో ఉన్న పుస్తకాలు మొత్తం చదివి అవపోసన పట్టిన ఒకే ఒక్కరు బాబాసాహెబ్ 

☞- ప్రపంచంలో అత్యధిక విగ్రహాలు గల ప్రజా నాయకుడు బాబాసాహెబ్ 

☞- ప్రపంచ చరిత్రలో అత్యంత ప్రభావశీలురైన 6గురు మేధావులలో బాబాసాహెబ్ ఒకరు

☞- లండన్ విశ్వవిద్యాలయంలో తన ఎనిమిదేళ్ళ Phd ని మూడు సంవత్సరాలలో పూర్తి చేసిన అత్యంత మేధావి

☞- తన ప్రమేయం లేదు కాబట్టి హిందూమతంలో పుట్టాను గానీ హిందూమతంలో మాత్రం చావను అని ఆయన బౌద్ధం తీసుకుంటే, మరో ఆలోచన లేకుండా 5లక్షల మంది బౌద్ధం తీసుకున్నారు.. ఇంతటి అభిమానం ఇంకే నాయకుడు పొంది ఉండడు. 

 ❤❤ అరుదైన గౌరవాలు ❤❤

☞- భారత రత్న - ఇంత ప్రపంచ మేధావికి స్వతంత్ర్యం వచ్చిన 43 ఏళ్ళకు గానీ గుర్తించలేకపోయింది కులం రోగంతో కొట్టుకుంటున్న భారత ప్రభుత్వం 

☞- కొలంబియా యూనివర్సిటీ ప్రకారం - ప్రపంచంలో అత్యంత ప్రభావశీలుడైన నాయకుడు 

☞- ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ప్రకారం విశ్వంలోనే అతిగొప్ప ఉద్యమ నిర్మాత

☞- CNN, IBN, History channel నిర్వహించిన సర్వే ప్రకారం THE GREATEST INDIAN


❇❇ బాబాసాహెబ్ గురించి బయటకు తెలియకుండా దాయబడుతున్న అంశాలు ❇❇


       బాబాసాహెబ్ ను నవ భారత నిర్మాతగా, భారతదేశ చరిత్రలో విప్లవాత్మక మార్పు తీసుకువచ్చిన ఒక అత్యంత ప్రభావశీలుడైన నాయకునిగా గుర్తిస్తుంటే, భారతదేశంలో మాత్రం ఆయనను ఒక కులానికి నాయకునిగా, ఒక వర్గానికి నాయకుడిగా చూస్తోంది., సంఘ్ విద్రోహులు బాబాసాహెబ్ అందరి నాయకుడు అంటూనే ఆయన గొప్పదనం తెలియజేయకుండా కేవలం ఆయనను రాజ్యాంగ రచయితగా మాత్రమే పరిమితం చేసి, హిందూ మత ఉద్ధారకునగా ప్రచారం చేస్తూ హిందూ ఓటు బ్యాంకు పెంచుకోవాలని కుట్ర పన్నుతోంది., ఇది బాబాసాహెబ్ ఆలోచన విధానాన్ని పూర్తిగా తుడిచి పెట్టే కుట్ర,. 


        ఇలాంటి సమయంలో బాబాసాహెబ్ నిజమైన గొప్పతనాన్ని తెలుసుకోకపోతే, మనువాద వక్రీకరణలే చరిత్రగా మారే ప్రమాదం ఉంది.. మన భావితరాలను ఈ వక్రీకరణల నుండి కాపాడుకోకపోతే., అంబేద్కరిజాన్ని పూర్తిగా తుడిచిపెట్టినవారం అవుతాం., 


✿✿☆ వివిధ రంగాల్లో బాబాసాహెబ్ కృషి - గొప్పతనాలు - వాటి ఫలితాలు .. ☆✿✿


✿ బాబాసాహెబ్ - మహిళా హక్కులు ✿

☞✓ హిందూకోడ్ బిల్లు - మహిళల విధ్య, ఆర్థిక సమానత్వం కోసం (హిందువులు తీవ్రంగా వ్యతిరేకించినందున పార్లమెంటు నిరాకరించడంతో బాబాసాహెబ్ మహిళా హక్కుల కోసం మంత్రి పదవి వదిలేసారు.)

☞✓ పురుషులతో పాటు మహిళలకు సమాన వేతనాలు 

☞✓ మహిళలకు గర్భధారణ సమయంలో 8 వారాల ప్రత్యేక సెలవు (Maternity leave).

☞✓ పని ప్రాంతాలలో మహిళకు ప్రత్యేక సౌకర్యాల కోసం పథకాలు

☞✓ స్త్రీ శిశు సంక్షేమ చట్టం - ఇది తరువాతి కాలంలో స్త్రీ శిశు సంక్షేమ శాఖ ఆవిర్భావానికి దారి తీసింది.


✗✗✗ అయినప్పటికీ మనువాదంలో మునిగి తేలుతున్న స్త్రీ సమాజం ఏనాడూ బాబాసాహెబ్ పేరు కూడా తలుచుకోదు., మహిళా హక్కులంటూ గొంతు చించుకునే మహిళా సంఘాలు బాబాసాహెబ్ గురించి ఒక్క మాట కూడా తమ సంఘాల వారికి చెప్పరు ✗✗✗


✿ బాబాసాహెబ్ - కార్మికుల హక్కులు ✿

☞✓ 8 గంటల పనిదినాలు - 7వ Indian Labour Conference, నవంబరు 27, 1942 లో 14 నుండి 8 గంటలకు కుదించారు

☞✓ ESI (Employee State Insurance) సౌకర్యం :- కార్మికుల ఆరోగ్య భద్రత కోసం (తూర్పు ఆసియాలోనే మొదటిది 

☞✓ ఇండియన్ ఫాక్టరీల చట్టం :- పని ప్రదశంలో నిర్ధిష్ట విధానాలు, జవాబుదారీతనం కోసం.

☞✓ కరువు భత్యం (Dearness Allowance)పెరిగిన నిత్యావసర కర్చులను భరించేందుకు వీలుగా 

☞✓ కనీస వేతనం ఉండే విధంగా చర్యలు

☞✓ కేంద్ర కార్మిక సంఘాల (సవరణ) చట్టం :- 1926 చట్టం కేవలం కార్మిక సంఘాలను రిజిష్ట్రేషను చేయడం మాత్రమే చెప్పింది ., 8 నవంబరు 1943న సవరణ చట్టం తీసుకొచ్చి పూర్తి విధివిధానాలు రూపొందించారు బాబాసాహెబ్

☞✓ ప్రావిడెంట్ ఫండ్ సౌకర్యం 


✗✗✗ కానీ ఏనాడూ బాబాసాహెబ్ పేరు కూడా ఎత్తకుండా కార్మికులను మాయలో ఉంచుతారు ఈ అగ్రకులాల నాయకత్వంలో ఉన్న కమ్యూనిజం ✗✗✗


✿ బాబాసాహెబ్ - రైతుల కోసం ✿

☞✓ నీటిపారుదల సౌకర్యాల పితామహుడు:- హిరాకుడ్ ప్రాజెక్టు, దామోదర్ నదీలోయ ప్రాజెక్టు, సోన్ నది లాంటి అత్యంత ప్రతిష్టాత్మక ప్రాజెక్టుల డిజైన్ దగ్గర నుండి పూర్తి చేసేదాకా బాబాసాహెబ్ కృషి ఉంది.. భారత దేశ చరిత్రలో అనుకున్న ఖర్చు మరియు అనుకున్న సమయంలో పూర్తయిన నీటిపారుదల జల విద్యుత్ ప్రాజెక్టులు ఇవే.,

☞✓ మెరుగైన నీటిపారుదల కోసం Central Waterway and Irrigation Commission (CWIRC) ఏర్పాటు చేసారు.

☞✓ జలవనరుల నుండి విధ్యుత్తుత్పత్తిని క్రమబద్ధం చేయడం కోసం Central technical power board స్థాపించారు. 

☞✓ ఇప్పటికీ సమస్యలు లేకుండా విజయవంతంగా నడుస్తూ దేశంలో విధ్యుత్తు సరఫరాలో కీలక పాత్ర పోషిస్తున్న "గ్రిడ్ వ్యవస్థ " బాబాసాహెబ్ ఆలోచనే.


✗✗✗ మొక్షగుండం విశ్వేశ్వరయ్య, నెహూ, పటేల్ ల వల్లనే ఇవన్నీ సాధ్యమైనాయంటూ బాబాసాహెబ్ పేరు కూడా తలవవు ఈ ప్రభుత్వాలు.. ✗✗✗


✿ బాబాసాహెబ్-నిరుద్యోగం-స్వయం వికాసం ✿

☞✓ ఇప్పుడు నిరుద్యోగులకు అత్యంత సహాయకరంగా నిలుస్తున్న "ఎంప్లాయిమెంట్ ఎక్సచేంజీలు" (Employement exchange) బాబాసాహెబ్ స్థాపించినవే

☞✓ భారత దేశంలో సాంకేతిక విధ్య అందుబాటులో లేని కారణంగా నిరుద్యోగులను యూనిట్ గా చేసుకుని  ITI లాంటి సంస్థలు ఏర్పాటు చేసి అవసరం అయితే వారిని విదేశాలకు పంపి శిక్షణ ఇప్పించాలని ప్రతిపాదించారు బాబాసాహెబ్ 


✿ భారతదేశ ఆర్థిక ప్రగతికి బాబాసాహెబ్ కృషి ✿

☞✓ రెండవ ప్రపంచ యుద్ధం సమయానికి ఆర్థికంగా పూర్తిగా దెబ్బతిన్న భారతదేశాన్ని మళ్ళీ పునర్నించే ప్రయత్నంలో భాగంగా నియమించిన  Reconstruction Commitee of Council లో బాబాసాహెబ్ సభ్యులుగా ఉన్నారు., నీటిపారుదల మరియు విధ్యుత్తుత్పత్తి ద్వారా ఆర్థిక ప్రగతికి బాటలు వేసారు..

☞✓ ఇప్పటిదాకా నివేదికలు సమర్పించిన 13 ఆర్థిక సంఘాల (Finance Commisions) నివేదికల కూడా బాబాసాహెబ్ Phd thesis అయిన "The Evolution of Provincial Finance in British India" నుండి సేకరించినవే.,

✍✓ ప్రపంచ ఆర్థిక వ్యవస్థలను ఘోరంగా దెబ్బ తీస్తున్న ఆర్థిక మాంద్యాలు కూడా భారతదేశాన్ని ప్రభావితం చేయలేక పోవడానికి ముఖ్య కారణం అయిన రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా స్థాపన పూర్తిగా బాబాసాహెబ్ కృషి ఫలితమే., రిజర్వు బ్యాంకు స్థాపన కోసం ఏర్పాటు చేసిన హల్టన్ అండ్ యంగ్ కమీషన్ పూర్తిగా బాబాసాహెబ్ రాసిన "The Problem of the Rupee – It’s origin and it’s solution.” ని అనుసరించింది.


✗✗✗ మరి ఈనాడు చూస్తే కరెన్సీ నోటు మీద గాంధీ బొమ్మ మరియు బ్యాంకుల్లో రవీంద్రనాద్ ఠాగోర్ ల ప్రవచనాలే కనిపిస్తాయి., నిజానికి  వీరి ఇద్దరి సహకారం శూన్యం..✗✗✗


✿ బాబాసాహెబ్ - హేతువాదం - సామాజిక ఉద్యమాలు ✿

☞✓ భారతదేశం విజ్ఞానపరంగా ముందుకు వెళ్ళకుండా మూఢనమ్మకాలలో మగ్గుతూ ఉండడానికి ముఖ్య కారణం హిందూమతం అని నినదించి., ఈ రుగ్మతలు ఒక సాంప్రదాయంగా కొనసాగిస్తున్న మనుధర్మాన్ని తగలబెట్టారు బాబాసాహెబ్ 

☞✓ ఒక సంస్కృతి సాంప్రదాయాన్ని ఎదుర్కోవడానికి హేతువాదం మాత్రమే సరిపోదు, ఒక హేతువాద భావనలు గల మరో సంస్కృతి సృష్టించాల్సిందే అని చెప్పి నవయానాన్ని ప్రభోధించారు బాబాసాహెబ్ 


✗✗✗ కానీ ఈనాడు హేతువాదులం అని చెప్పుకునే ఏ అగ్రకులం వాడు బాబాసాహెబ్ పేరు తలవడానికి ఇష్టపడడు ✗✗✗


     ఇలా మనువాద భావనలు నిండిన మన సమాజం బాబాసాహెబ్ ఈ దేశ వ్యవస్థకు అందించిన సహకారం పూర్తిగా విస్మరిస్తూ వస్తోంది .


✿ బాబాసాహెబ్ తన జీవిత కాలంలో నిర్వహించిన బాధ్యతలు ✿


- ఒక గొప్ప సామాజిక శాస్త్రవేత్త..

- ఒక ప్రఖ్యాత న్యాయకోవిదుడు..

- ఒక విశిష్టమైన చరిత్రకారుడు..

- ఒక ప్రతిష్టాత్మక ఆర్థిక శాస్త్రవేత్త...

- ఒక అద్భుతమైన రచయిత..

- ఒక తిరుగులేని ఉద్యమకారుడు..

- ప్రజలను కట్టిపడేయగల వక్త.. 

- ప్రపంచంలో మరెవరూ చదవలేనన్ని,

- డిగ్రీలను అందుకున్న ప్రపంచ మేధావి..

- భారత రాజ్యాంగ నిర్మాత..

- అన్నిటికంటే ముఖ్యంగా ఒక మానవతావాది,

- స్వేచ్చ, సమానత్వ స్థాపన కోసం,

తపన పడ్డ, సామాజిక విప్లవకారుడు..

- భారత భూమిపై నడయాడిన ఒక...

☆☆ "గ్రేటెస్ట్ ఇండియన్" "Greatest Indian"☆☆


      "జీవితం సుదీర్ఘంగా ఉండాల్సిన అవసరం లేదు,, గొప్పగా ఉండాలని" బాబాసాహెబ్ చెప్పిన మాటలు ఆయనకే వర్తించాయి.. 

       

     ((☞☞ పైన విషయాలు కొన్ని మాత్రమే, బాబాసాహెబ్ గురించీ మీరు కూడా మీకు తెలిసిన కొన్ని జోడించి, మన ఇంట్లో పిల్లలకు ఈ విషయాలు అవగాహన కల్పించకడి., కుదిరితే మీ దగ్గర లోని SC,ST,BC హాస్టల్ లకు ఒక సాయంత్రం వెళ్ళి బాబాసాహెబ్ నిజమైన గొప్పతనాన్ని మన తరువాతి తరాలకు వివరించండి ☜☜ ))

       

       ☞☞ భారతదేశ సామాజిక ఉద్యమ పితామహుడు, ప్రపంచ మేధావి, నిజమైన ప్రజా నాయకుడు బాబాసాహెబ్ కు ఆయన 60 వ వర్ధంతి సంధర్బంగా అశ్రునివాళి అర్పిస్తూ ...మీ.........

Read More

Sunday, August 7, 2016

పోస్టాఫీసుల్లో టెన్త్, ఇంటర్‌లకు ఉద్యోగాలు

Posted by Unknown
పోస్టాఫీసుల్లో టెన్త్, ఇంటర్లకు ఉద్యోగాలు


రిక్రూటర్ : డిపార్ట్ మెంట్ ఆఫ్ పోస్ట్
పోస్టులు : పోస్టల్ అసిస్టెంట్స్
మొత్తం పోస్టులు : 16
పోస్టులు : పోస్ట్ మన్
మొత్తం పోస్టులు : 28
పోస్టులు : సార్టింగ్ అసిస్టెంట్
మొత్తం పోస్టులు : 7
పోస్టులు : మల్టీ టాస్కింగ్ స్టాఫ్ (ఎంటిఎస్) 
మొత్తం పోస్టులు : 15
వయో పరిమితి : 25 సం.లు. (జనరల్), ఇతరులకు 27 సం.లు.
అర్హతలు : సార్టింగ్ అసిస్టెంట్స్... ఇంటర్మీడియట్
పోస్ట్ మన్... టెన్త్ ఉత్తీర్ణత
ఎంటిఎస్... టెన్త్ ఉత్తీర్ణత లేదా ఐటిఐ
పేస్కేల్ : రూ.5,200 - 20,200లు ప్లస్ గ్రేడ్ పే రూ.1,800 / 2,000 / 2,400లు.
దరఖాస్తుకు తుదిగడువు : 14-08-2016
పూర్తి వివరాలకు : 

http://employment-newspaper.com/wp-content/uploads/2016/07/Postal-Dept-Recruitment-2016.pdf

Read More

పోస్టాఫీసుల్లో టెన్త్, ఇంటర్‌లకు ఉద్యోగాలు

Posted by Unknown 2 Comments
పోస్టాఫీసుల్లో టెన్త్, ఇంటర్లకు ఉద్యోగాలు


రిక్రూటర్ : డిపార్ట్ మెంట్ ఆఫ్ పోస్ట్
పోస్టులు : పోస్టల్ అసిస్టెంట్స్
మొత్తం పోస్టులు : 16
పోస్టులు : పోస్ట్ మన్
మొత్తం పోస్టులు : 28
పోస్టులు : సార్టింగ్ అసిస్టెంట్
మొత్తం పోస్టులు : 7
పోస్టులు : మల్టీ టాస్కింగ్ స్టాఫ్ (ఎంటిఎస్) 
మొత్తం పోస్టులు : 15
వయో పరిమితి : 25 సం.లు. (జనరల్), ఇతరులకు 27 సం.లు.
అర్హతలు : సార్టింగ్ అసిస్టెంట్స్... ఇంటర్మీడియట్
పోస్ట్ మన్... టెన్త్ ఉత్తీర్ణత
ఎంటిఎస్... టెన్త్ ఉత్తీర్ణత లేదా ఐటిఐ
పేస్కేల్ : రూ.5,200 - 20,200లు ప్లస్ గ్రేడ్ పే రూ.1,800 / 2,000 / 2,400లు.
దరఖాస్తుకు తుదిగడువు : 14-08-2016
పూర్తి వివరాలకు : 

http://employment-newspaper.com/wp-content/uploads/2016/07/Postal-Dept-Recruitment-2016.pdf

Read More

ఇంటర్వ్యూల్లో సెవెన్ డెడ్లీ మిస్టేక్స్!

Posted by Unknown



ఇంటర్వ్యూలకు వెళ్లినప్పుడు తెలిసో తెలియకో అభ్యర్థులు చేసే తప్పుల్లో సరిచేసుకోలేని ఏడు తప్పులివే...
1. ఆలస్యంగా వెళ్లడం...
ఎక్కడైనా ఆలస్యమైతే ఫరవాలేదేమో కాని, ఇంటర్వ్యూకి ఆలస్యంగా వెళితే అసలుకే మోసం వస్తుంది. సమయానికి వెళ్లకపోతే 'మీ స్వభావం ఇంతే' కావచ్చునని హెచ్ఆర్ భావించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మీకు ఉద్యోగం ఇచ్చి మీపై ఆధారపడడం సాధ్యం కాదk
న్న నిర్ణయానికి వచ్చేస్తారు. సో... ఇంటర్వ్యూ సమయం కంటే ముందుగానే అక్కడికి చేరుకుని కొద్దిసేపు రిలాక్స్ అయితే మీకే మంచిది.
2. మాజీ బాస్ని తిట్టిపోయడం...
ఇంతకుముందు చేసిన ఉద్యోగం ఎందుకు మానివేశారో చెప్పేటప్పుడు మీ నోరు జాగ్రత్త! బాస్ క్రేజీ అనో, కంపెనీ మేనేజ్మెంట్ మంచిది కాదనో, అవినీతిపరులనో చెప్పుకుంటూ వాచాలత్వానికి పోయారనుకోండి... ఇంటర్వ్యూ చేస్తున్న వారికి మీపై దురభిప్రాయం ప్రబలిపోతుంది... మంచికైనా, చెడుకైనా... మీ మాజీ బాస్ గురించి, కంపెనీ గురించి చెడుగా మాట్లాడకుండా ఉండడమే ఉత్తమం. తమ కంపెనీకి సంబంధించి ఆయా సందర్భాలలో మీరెలా స్పందిస్తారన్నది మీ వాచాలత్వాన్ని బట్టి హైరింగ్ మేనేజర్లు నిర్ణయించుకుంటారు!
3. మీరెలా రాణిస్తారో ఉదాహరణలతో చెప్పాలి...
మీరు ఇన్నోవేటివ్ జీనియస్ లేదా గ్రేట్ స్ట్రాటజిస్ట్ అయితేనో సరిపోదు... మీరెలా రాణిస్తారో, గోల్స్ ఎలా సాధిస్తారో ఉదాహరణలతో సహా మీ స్కిల్స్ గురించి చెప్పుకోగలగాలి. లేకపోతే మీకు మంచి మార్కులు పడవని గ్రహించండి... సో, ఇంటర్వ్యూకు వెళ్లే ముందే మీరు సంసిద్ధులై ఉండాలి.
4. అసందర్భ జోక్స్కి తావులేదు!
ఇంటర్వ్యూ సమయంలో హెచ్ఆర్ లేదా మేనేజర్ మీ స్వభావాన్ని అంచనా వేస్తూ ఉంటారు. క్లిష్ట సమయాల్లో మీరెలాంటి నిర్ణయం తీసుకుంటారన్నదే వారికి కావలసింది... ఇందుకోసం వారు మీతో ఫ్రెండ్లీగా మూవ్ అవుతూ, అప్పుడప్పుడు అసందర్భ జోకులు కూడా పేలుస్తుంటారు... అయితే, వీటి వెనుక ఒక వ్యూహం ఉందని గ్రహించకపోతే అంతేసంగతులు! జాబ్ ఇచ్చిన తర్వాత మీరు రాణించగలరా, షో నటిస్తున్నారా అనేది వారు ఇట్టే పసిగట్టేస్తారు!
5. మీరూ ప్రశ్నించాలి!
ఉద్యోగం వచ్చిన తర్వాత ఇదే కంపెనీలో, ఇదే ఉద్యోగంలో, ఇదే మేనేజర్తో మీరు రోజుకి ఎనిమిది గంటలు గడపాలి. మిమ్మల్ని ఇంటర్వ్యూ చేసేవారు మీరు ఏం అడుగుతారా అని ఎదురుచూస్తుంటారు. జాబ్ గురించిన డిటైల్స్, డిపార్ట్ మెంట్ డిటైల్స్, అక్కడి సహచరులు, సూపర్ వైజర్ల గురించి, ఆర్గనైజేషన్ వర్క్ కల్చర్ గురించి మీరు అడగాలి! ఒకవేళ మీరేమీ అడగకపోతే మీకు ఇంటరెస్ట్ లేదనో లేకపోతే జాబ్ గురించి అంతగా ఆలోచించడం లేదనో భావిస్తారు. కాబట్టి, ఇంటర్వ్యూకు వెళ్లే ముందే అర్ధవంతమైన, ఆలోచనాత్మకమైన ప్రశ్నలు ఏమడగాలో ప్రిపేర్ కండి!
6. కోపం, విసుగు పనికిరాదు!
ఉద్యోగం వెతుకులాట కష్టమే... నిరుత్సాహం కలగడం సహజమే... కాని, జాబ్ సెర్చ్లో మీరు కోపం, విసుగు ప్రదర్శిండం లేదా మాజీ బాస్ గురించి నెగెటివ్గా స్పందిస్తే మీకే నష్టం... మంచి కంపెనీల నుంచి మీకు ఆఫర్ లు వచ్చే అవకాశం కోల్పోతారు... కోపంతో చిరచిరలాడే వారిని ఉద్యోగంలో పెట్టుకుందామని ఎవరూ అనుకోరు కదా!
7. ఫ్రెండ్లీగా, కలుపుగోలుగా ఉండాలి...
తమ ఉద్యోగులు ప్లెజెంట్గా ఉండాలనే ఎవరైనా కోరుకుంటారు. అయితే... మీరు బిగుసుకుపోయి, అహంతో మెరటుగా ఉంటే మీకెన్ని క్వాలిఫికేషన్లు ఉన్నా ఉపయోగం లేదు! ఫ్రెండ్లీగా, కలుపుగోలుతనంగా సహచరులతో ఉంటారని భావిస్తేనే మీకు ఉద్యోగం ఇస్తారు... సో, బి కేర్ ఫుల్!

Read More

వీటికి సరైన ఆన్సరిస్తే జాబ్ వచ్చినట్టే!?

Posted by Unknown



అన్ని ఇంటర్వ్యూలను వడపోసిన అనలిస్టులు కేవలం నాలుగంటే నాలుగు ట్రికీ ప్రశ్నలనే కంపెనీలు తిప్పి తిప్పి అడుగుతుంటాయని తేల్చారు!
ఈ నాలుగు ట్రికీ ప్రశ్నలకు సరైన సమాధానాలిస్తే ఏ అభ్యర్థికైనా జాబ్ దాదాపు వచ్చేసినట్టే!
మరి, అవేంటో మీకోసం ప్రత్యేకంగా...
1. మీ గురించి చెప్పండి!
ఈ ప్రశ్న వినడానికి చాలా సాధారణంగా అనిపించినా, ఇందులో సముద్రం అంతా లోతుంది! ఈ ప్రశ్నలోని అంతరార్ధం కంపెనీకి మీ వల్ల ఎటువంటి లాభం చేకూరుతుందని ఎంప్లాయర్ భావిస్తున్నాడన్నమాట!
ఈ ప్రశ్నకు మీరు చాలా క్లుప్తంగా, సింపుల్గా సమాధానం ఇవ్వాలి...
మీరు అప్లై చేసిన ఉద్యోగానికి సంబంధించి మీకున్న అనుభవాన్ని సూటిగా, స్పష్టంగా చెప్పండి...
అలాగే, మీరు ఆ ఉద్యోగం ద్వారా కంపెనీకి ఏం సాధించి పెడతారో స్పష్టం చేయండి...
మీ రెజ్యూమ్లో పేర్కొన్న అంశాలనే సమ్మరైజ్ చేయండి... మధ్యలో ఖాళీగా ఉంటే ఎందుకు ఉండాల్సి వచ్చిందో కన్విన్సింగ్గా చెప్పండి...
2. ఇంతకుముందు ఉద్యోగాన్ని ఎందుకు మానేశారు?
ఇది కూడా రొటీన్ క్వశ్చన్ కానే కాదు... మీరు ఇంతకుముందు కంపెనీ నుంచి ఎందుకు, ఏవిధంగా మానివేయాలని నిర్ణయించుకున్నదీ తెలుసుకుని మీ గురించి ఒక అంచనాకు రావడానికే ఈ క్వశ్చన్!
మీరు ఇప్పటికీ ఉద్యోగం చేస్తుంటే... ఇంకా మంచి అవకాశం కోసమేనని చెప్పాలి...
ఒకవేళ మీరు ఉద్యోగం పోగొట్టుకుని ఉంటే... వేరే అవకాశాల కోసం చూస్తున్నానంటూ, మీరు సాధించిన విజయాల గురించి చెప్పండి...
3. మీరెంత శాలరీ ఆశిస్తున్నారు?
మిమ్మల్ని మీరు సరిగ్గా ప్రజెంట్ చేసుకోగలుగుతున్నారా, లేదా అని ఎంప్లాయర్ చూస్తున్నాడన్నమాట!
అత్యాశకు పోయి ఎక్కువ శాలరీ అడగొద్దు... అలాగని మరీ తక్కువకు కూడా సిద్ధపడవద్దు... 
నెగోషియబుల్ అనే చెప్పండి... ఇదే పొజిషన్లో ఇతరులకు ఎంత శాలరీ ఇస్తున్నదీ ముందుగానే తెలుసుకోండి... అంతే ఆశించండి...
4. మీ భవిష్యత్ గోల్స్ ఎమిటి?
మీరిచ్చే సమాధానాన్ని బట్టే మీరు తమ కంపెనీకి సరిపోతారా, లేదా అని కంపెనీలు నిర్ణయించుకుంటాయి...
మరింతగా రాణించడం, మరిన్ని స్కిల్స్ నేర్చుకోవడం...
కంపెనీలో ఎంత బాధ్యతాయుతంగా పనిచేయాలనుకుంటున్నదీ చెప్పడం...
ఏవిధంగా పాజిటివ్ రిజల్ట్స్ రాగలిగేదీ సూటిగా, ధీమాగా చెప్పడం... ఇందుకు సరైన ఉదాహరణలు ఇవ్వడం...
ఈ నాలుగు ప్రశ్నలకు సరైన సమాధానాలివ్వగలిగితే దాదాపు జాబ్ వచ్చేసినట్టే...!

Read More

హెచ్ఆర్‌లు అడిగే ట్రికీ ప్రశ్నలివే!

Posted by Unknown
హెచ్ఆర్లు అడిగే ట్రికీ ప్రశ్నలివే!


ఏ కంపెనీలోనైనా హెచ్ఆర్ ఇంటర్వ్యూ చివరిదై ఉంటుంది. ఈ సందర్భంలో ప్రతి అభ్యర్థి మైండ్లోనూ ఒక్కటే ప్రశ్న మెదలుతూ ఉంటుంది. హెచ్ఆర్ ఏయే ప్రశ్నలు వేస్తారా అని! ఎటువంటి కన్ఫ్యూజన్ లేకుండా, సూటిగా, స్పష్టంగా హెచ్ఆర్కు సమాధానాలు ఇవ్వడం ఫ్రెషర్స్కు అంత తేలికేమీ కాదు... టాప్ కంపెనీల్లో హెచ్ఆర్లు అడిగిన ప్రశ్నలు ఇలా ఉన్నాయి...
1. మీ గురించి చెప్పండి...!
ఇది చాలా జనరల్గా అన్ని ఇంటర్వ్యూల్లోనూ అడిగే ప్రశ్న... అయితే, ఇది చాలా ట్రికీ ప్రశ్న! మీరు ఈ ఉద్యోగానికి ఎలా క్వాలిఫైడో చెప్పడం ప్రారంభించాలి... ఇక్కడ గుర్తంచుకోవాల్సింది ఏమిటంటే... మీ విద్యార్హతలు, అనుభవం ఆ పోస్టుకు సరిపోతాయా లేదా అని హెచ్ఆర్ గమనిస్తున్నాడని! అయితే, మీరు గడగడా చెప్పినా అది ముందే రిహార్సల్ చేసుకున్నట్టు ఉండకూడదు!!
2. మీ గ్రేటెస్ట్ స్ట్రెంగ్త్స్ ఏమిటి? 
మీరు ఎన్ని చెప్పినా మంచిదే! కాని, అవి పాజిటివ్గా ఉండాలి... అంటే, ప్రాబ్లెం సాల్వింగ్ స్కిల్స్, కష్టపడి పనిచేయడం, ఫ్రొఫెషనల్ ఎక్స్పర్టైజ్, లీడర్షిప్ స్కిల్స్, పాజిటివ్ యాటిట్యూడ్... తదితర అంశాల గురించి చెప్పాలి.
3. మీరు ఏ విషయంలో వెనుకబడి (blind spots) ఉన్నారు?!
లోపాయికారి ప్రశ్న! జాగ్రత్త... మీ బలహీనతల గురించి అడుగుతున్నారంటే... షార్ట్ లిస్ట్ చేయడానికి, మిమ్మల్ని ఎలిమినేట్ చేయడానికి చూస్తున్నారని అర్ధం చేసుకుని సమాధానం జాగ్రత్తగా చెప్పాలి...
4. మీకెందుకు ఈ ఉద్యోగం ఇవ్వాలి?
ఈ ప్రశ్నను మీరు అడ్వాంటేజ్గా తీసుకోవాలి... కంపెనీ అవసరాలు, డిమాండ్ ఏంటో అర్ధం చేసుకోండి... ఎవరో ఒకరిని కాకుండా మిమ్మల్నే ఎందుకు తీసుకోవాలో మీ స్ట్రెంగ్త్స్ అండ్ స్కిల్స్ గురించి సూటిగా, స్పష్టంగా చెప్పండి.
5. ఇంతకుముందు ఉద్యోగాన్ని ఎందుకు మానివేశారు?
ఈ ప్రశ్నకు మీరు పాజిటివ్గా జవాబివ్వాలి... మీ మాజీ బాస్ లేదా కంపెనీ గురించి నెగెటివ్గా, బ్యాడ్గా ఎప్పుడూ, ఎక్కడా చెప్పకండి. సరైన కారణం చెప్పండి.
6. మరో అయిదేళ్లలో మీరు ఏ పొజిషన్లో ఉంటారని భావిస్తున్నారు?
మరీ స్పెసిఫిక్గా ఉండకండి... లాంగ్ టెర్మ్ కమిట్మెంట్ ఇవ్వకండి... ఇదే పొజిషన్ కోసం చూస్తున్నట్టు మాత్రమే చెప్పండి.
7. కంపెనీకి మీరు ఏవిధంగా ఎస్సెట్ అవుతారు?
ఈ ప్రశ్నను కూడా మీరు అడ్వాంటేజ్గా తీసుకోవాలి. మీ బలబలాలను, స్కిల్స్ ను వివరిస్తూ హెచ్ఆర్ లేదా ఇంటర్వ్యూయర్లో కాన్ఫిడెన్స్ నింపండి...
8. మీరేమైనా ప్రశ్నలు అడుగుతారా?
జాగ్రత్త! అడ్వాంటేజ్ తీసుకుని పిచ్చి ప్రశ్నలు అడగకండి... నేనెప్పుడు డ్యూటీలో జాయిన్ కావచ్చు... ఇలాంటి ప్రశ్నలు అడగండి... ఇంకా మీ మేనేజ్మెంట్ గురించి, టెక్నికల్స్ గురించి ప్రశ్నలు ఉంటాయి...

Read More